Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేషన్..
Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆపరేషన్ (Rare surgery) చేసి చారిత్రక విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ (successful liver transplant surgery) చేశారు. ఆ రోగి ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధైన మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome)తో బాధపడుతున్నాడు. అంతేకాదు.. అతడు హెపటో పల్మనరీ సిండ్రోమ్ (HPS) అనే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో కలిగి ఉండటం వైద్యులకు సవాల్‌గా మారింది. అలాంటి కేసులో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (liver transplant surgery)ను విజయవంతంగా పూర్తి చేశారు.
జన్యుపరమైన వ్యాధితో బాధపడతుండగా…
మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) అనేది జన్యు (genetic) మార్పులతో ఏర్పడే వ్యాధి. ఇది శరీరంలోని కండరాలు, రక్...




