Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్.. భక్తులకు మెరుగైన వైద్య సేవలు
Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మహా కుంభామేళాలో భక్తులకు ఆయన ఎనలేని సేవలు అందించారు. భక్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్కడ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విషయం ఇది. ఆ సమయంలో ప్రయాగ్ (ప్రస్తుత ప్రయాగ్‌రాజ్) నగరంలో జరిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవలు అందించారు. కుంభామేళా (Kumbh Mela) లలో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాలయాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్.ఎ.హుస్సేన్, వినోద్ కుమార్ భట్నాగర్ అనే పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు.
Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కారణాలు?
ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...