Mechanical Elephants | ఇక ఉత్సవాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్రతిపాదన
Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాలను కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల్లో జరిగే పండుగల సమయంలో ఈ దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
నిజమైన ఏనుగుల్లా Mechanical Elephants
ఉత్సవాల్లో ఏనుగులను వినియోగించడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి పెరిగి అవి విచక్షణ కోల్పోయి హింసాత్మకంగా మారుతున్నాయని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగులను వినియోగించాలని కోరింది. అచ్చం అసలైన ఏనుగుల్లా జీవం ఉట్టిపడే విధంగా ఇవి ఉంటాయని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ) ఏనుగులను తాము సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని PETA అంటోంది. అయితే.. దానికి ఒక షరతు విధించింది. ఉత్సవాలకు వి...




