PM Surya Ghar Muft Bijli Yojana : సోలార్ కరెంటుపై భారీ సబ్సిడీ.. ఇన్‌స్టాలేషన్ ఫ్రీ
PM Surya Ghar Muft Bijli Yojana : సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఈ సోలార్ కరెంటుపై చాలా మందికి ఆసక్తి ఉండదు. ఇదెంత ప్రయోజనకరమైనా దీనిపై ఇంట్రెస్టు చూపరు. అతి తక్కువ ఖర్చుతో గృహోపయోగాలకు విద్యుత్తును పొందొచ్చని తెలిసినా దీని వైపు మొగ్గు చూపరు. ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే ఖర్చుకు భయపడి చాలా మంది సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకురారు.అయితే.. ఇక ఇలాంటి ఇబ్బందులు ఉండబోవంటోంది కేంద్ర ప్రభుత్వం. ‘పీఎం సూర్యగృహ ముస్త్ బిజ్లీ యోజన’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా సోలార్ విద్యుత్తును పొందడం ఇక ఈజీ. ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది.
ఉచిత విద్యుత్తే లక్ష్యంగా…
ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 ఫి...




