Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏమిటంటే
Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో (డిసెంబర్-జనవరి మధ్య) వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినం సాధారణంగా మోక్షదా ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశికు సమాంతరంగా వస్తుంది.
వైకుంఠ ఏకాదశి అంటే..
ప్రతి నెలా చంద్రమాసంలో కృష్ణ పక్షం, శుక్ల పక్షం రెండింటిలోనూ వచ్చే ఏకాదశి తిథులు విశేషంగా భావించబడతాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అత్యంత పవిత్రమైన నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి.
ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి
ఈ సంవత్సరం జనవరి 10 (శుక్రవారం) వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు భక్తులు విశేష పూజలు, ఉపవాసం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందుతారు.
పౌరాణిక ప్రాముఖ్యత. రాసురుని కథ
కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలు, సాధువులను హింసిస్తూ భయాందో...




