New Delhi : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరి మద్దతు ధర (MSP) పెంచాలని నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను రూ.69లకు పెంచింది. తాజా పెంపుతో క్వింటా వరి మద్దతు ధర రూ.2,369 కి చేరింది. ఈ మద్దతు ధర కోసం కేంద్రం రూ.2.70 లక్షల కోట్ల కేటాయించింది. అంతేకాదు.. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్‌లో వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి క్వింటాల్ వరిపై రూ.69 పెంచడంతో కనీస మద్దతు ధర రూ.2369కి చేరింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల(MSP) ను భారీగా భారీగా పెంచినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ఎంఎస్‌పీ పెంపును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని వెల్లడించారు. ఆయా పంటలకు ఎంఎస్‌పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లతో పాటు రైతుల పెట్టుబడిపై 50శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.