తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం (Child Marriage) చేశారు. ఆ బాలికకు పెళ్లి చేసే స్థోమత లేకపోవడంతో ఆమె కుటుంబం బాల్య వివాహం చేయాలని నిర్ణయించుకుంంది.మే నెలలో వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ మైనర్ బాలిక పాఠశాలలో తన ఉపాధ్యాయుడికి తన విషయాన్ని చెప్పడంతో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు ప్రారంభించారు.
8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మే 28న కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ తో వివాహం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలిక తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబ సభ్యులు, ఓ మధ్యవర్తి ద్వారా 40 ఏళ్ల వ్యక్తిని సంప్రదించారు. ఈ క్రమంలో వివాహం మే నెలలో జరిగింది.
వివాహం జరిగిన వారం తర్వాత, ఆ అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చి, తన మంగళసూత్రం, మట్టెలు తొలగించి, పాఠశాలకు తిరిగి వెళ్ళింది. ఆమె టీచర్ విచారించగా, ఆ అమ్మాయి జరిగిన మొత్తం విషయాన్ని వెల్లడించింది. టీచర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వేగంగా చర్య తీసుకుని, వరుడు, అతని మొదటి భార్య, వివాహానికి సహాయం చేసిన బ్రోకర్, వేడుకను నిర్వహించిన పూజారిని అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.