Nalgonda News : రూ. 70వేలు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) జావేద్ సోమవారం ఏసీబీ (Telangana ACB) అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖ (Civil Supplies)లో డీటీగా విధులు నిర్వహిస్తున్న జావేద్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడిన మూడు వాహనాలను విడిపించేందుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో, రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి జావేద్ డబ్బులు అడిగినట్లు నిర్ధారించారు. సోమవారం అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు – Whatsapp (9440446106), Facebook (Telangana ACB), x లో (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు. బాధితుడు లేదా ఫిర్యాదుదారుడి పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.