farmer’s protest in Gajwel : రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొరత (urea shortage) వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
రోడ్డు పైకి వందలాది మంది రైతులు
ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జరిగింది. వందలాది మంది రైతులు భారీ సంఖ్యలో ఉదయం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా యూరియా సమస్యను పరిష్కరించాలని నినదించారు. ఈ నిరసన కారణంగా రాజీవ్ రహదారిపై వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
farmer’s protest : డిమాండ్లు ఏమిటంటే..
రైతులు (Farmers) ప్రధానంగా రెండు డిమాండ్లు చేశారు. యూరియా ఎరువుల సరఫరాను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి పంటలకు యూరియా తప్పనిసరి అని, మార్కెట్‌లో మాత్రం అందుబాటులో లేదని అన్నారు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గతంలో గజ్వేల్‌లో రేక్ పాయింట్ (రైలు ద్వారా ఎరువులు దిగజార్చే కేంద్రం) ఉండేదని, అది తొలగించడంతో ఎరువుల రవాణా ఆలస్యం అవుతుందని రైతులు చెబుతున్నారు. రేక్ పాయింట్ మళ్లీ ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి వేగంగా ఎరువులు చేరతాయని డిమాండ్ చేశారు. తమకు అండగా ఉంటామని అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ గాలికి వదిలేసిందని రైతులు ఈ సందర్భంగా విమర్శించారు. “మా పంటలు ఎండిపోతున్నాయి, మేము అప్పుల్లో కూరుకుపోతున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు” అని ఆరోపించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.