Haryana IPS officer suicide case | హర్యానా పోలీసు అధికారి వై. పురాణ్ కుమార్ మృతి కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు అధికారి రోహ్తక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని సందీప్ కుమార్‌గా గుర్తించారు. ఆయన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయన సైబర్ సెల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
లాధోట్ గ్రామంలోని అతని ఇంటి నుంచి మూడు పేజీల సూసైడ్ నోట్ తోపాటు ఒక వీడియోను స్వాధీనం చేసుకున్నారు. కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ నోట్లో, వై. పురాణ్ కుమార్ ఒక “అవినీతి అధికారి” అని, అతనిపై “తగినంత ఆధారాలు” ఉన్నాయని ఆరోపించారు. కుల వివక్ష సమస్యను ఉపయోగించి ఐపీఎస్ అధికారి వ్యవస్థను హైజాక్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. “నేను ఎప్పుడూ సత్యం పక్షాన ఉంటాను. స్వాతంత్ర్య పోరాటంలో నా కుటుంబం పాల్గొంది. భగత్ సింగ్‌ను నా ఆదర్శంగా భావిస్తాను” అని సైట్ నుండి దొరికిన నోట్లో ఉంది. 
ఎస్పీ రోహ్తక్ సురేంద్ర సింగ్ భోరియా స్పందిస్తూ ASI సందీప్ ను చాలా నిజాయితీపరుడని, కష్టపడి పనిచేసే అధికారి అని గుర్తు చేసుకున్నారు. “అతని మృతదేహం లభ్యమైంది. ఇక్కడికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు…అతన్ని సైబర్ సెల్లో పోస్ట్ చేశారు” అని భోరియా విలేకరులకు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    