వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate )కార్యాలయంలో హోలీ పండుగ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య అధికారులు, సిబ్బంది కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్కు అధికారులు, సిబ్బంది రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ దంపతులతో పాటు అధికారులు, సిబ్బంది తీన్మార్, నాగిన్ డాన్స్లతో సందడి చేశారు.
హోలీ పండుగ ఐక్యతకు ప్రతీక అని , అందరూ శాంతి, సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








