- హన్మకొండ జిల్లాలో విచ్చలవిడిగా అనుమతి లేని కళాశాలలు (Illegal colleges )
- పేరుకే అకాడమీలు …నిర్వహించేది జూనియర్ కాలేజీలు
- పర్మిషన్ లేకుండానే అదనపు కాలేజీలు నిర్వహిస్తున్న రెజోనెన్సు
- అకాడమీ మాటున కళాశాల నడిపిస్తున్న వేదాంతు
- చర్యలు తీసుకోకుండా ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాస్తామని చేతులు దులుపుకుంటున్న హన్మకొండ డీఐఈవో
Hanmakonda | విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి ధనార్జనే ధ్యేయంగా అనుమతి లేని కళాశాల (Illegal colleges )లను కొంతమంది నిర్వహిస్తుంటే,మరికొంతమంది ఒకటి రెండు బ్రాంచీలకే పర్మిషన్ తీసుకొని అదనంగా మరికొన్ని బ్రాంచీలను ఓపెన్ చేసి విచ్చలవిడిగా ఐఐటీ, జేఈఈ, నీట్ అంటూ లక్షల రూపాయల ఫీజులంటూ విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని ఫీజుల రూపంలో తాగుతున్నట్లు తెలుస్తోంది.అనుమతి లేకుండా కళాశాలలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ కృష్ణ ఆదిత్య పదే పదే ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెప్పినప్పటికీ హన్మకొండ జిల్లాలో మాత్రం ఆయన ఆదేశాలు అమలు కావడంలేదని స్పష్టంగా కనిపిస్తోంది.అసలు హన్మకొండ లో అనుమతి లేకుండా విచ్చలవిడిగా జూనియర్ కాలేజీలు వెలసిన విషయాన్ని స్థానిక జిల్లా డీఐఈవో ఇంటర్మీడియట్ బోర్డు కు రిపోర్ట్ రూపంలో అందజేశారా? లేదా? అనేది డీఐఈవో కే తెలియాలి.
Illegal colleges : రెజోనెన్సా…మజాకా..?
హన్మకొండ నగరంలో 4 బ్రాంచీలకే అనుమతి తీసుకున్న రెజోనెన్సు కళాశాల యాజమాన్యం అనుమతి లేకుండా మరో 5 కళాశాలలను నిర్వహిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కే సవాల్ విసురుతున్నారు.సదరు యాజమాన్యం బరితెగింపు వెనుక పెద్దమొత్తంలో ముడుపులు రహస్యం దాగిఉందని, అందుకే ఆ బ్రాంచీలను డీఐఈవో సీజ్ చేయడంలేదని ప్రచారం జరుగుతోంది.ఇదిలావుండగా ఈ కాలేజీలపై హన్మకొండ డీఐఈవో మాట్లాడుతూ రెజోనెన్సు కు 4 బ్రాంచీలకే అనుమతి ఉందని, మిగిలిన బ్రాంచీలపై చర్యల నిమిత్తం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు రిపోర్ట్ రాసి పంపిస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఇంటర్మీడియట్ బోర్డ్ కు రిపోర్ట్ పంపించలేదని సమాచారం.
అడ్మిషన్లు వేదాంతు… హాల్ టికెట్లు రామప్ప..?
కార్పోరేట్ కాలేజి అని ప్రచారం చేసుకుంటూ పిఆర్ఓలను నియమించుకుని అడ్మిషన్లు చేసుకున్న “వేదాంతు” కు అసలు అనుమతి లేదని అది అకాడమీ మాత్రమేనని జూనియర్ కాలేజి కాదని హన్మకొండ డీఐఈవో గోపాల్ స్పష్టం చేశారు.ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే వేదాంతు కాలేజి పేరుతో అడ్మిషన్లు తీసుకొని తీరా పరీక్షలు(హాల్ టికెట్లు) మాత్రం రామప్ప కాలేజి నుండి రాసేలా సదరు రెండు యాజమాన్యాల మధ్యలో అవగాహన కుదిరిందని విశ్వసనీయంగా తెలిసింది. హన్మకొండ లోకల్ బస్ డిపో దగ్గర్లోని కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న ఈ కాలేజి కానీ కాలేజికి డీఐఈఓ సహకారం గట్టిగానే ఉందని ఆరోపణలు ఉన్నాయి.
సార్.. ఈ బాగోతం మీకు తెలుసా..?
హన్మకొండ నగరంలో విద్యాశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ అనుమతి లేకుండా బ్రాంచీలు ఓపెన్ చేస్తూ అలాగే అకాడమీల పేరుతో జూనియర్ కాలేజీలు నడుస్తున్న విషయం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కి తెలుసా? లేదా?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రెజోనెన్సు విచ్చలవిడిగా బ్రాంచీలు ఓపెన్ చేయడం,అకాడమీ పేరుతో వేదాంతు కళాశాల నిర్వహించడం పై సర్కార్ లైవ్ వరుస కథనాలు ప్రచురించగా హన్మకొండ డిఐఈఓ స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు కు చర్యల నిమిత్తం రిపోర్ట్ రాస్తామని తెలిపారు. అసలు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కు రిపోర్ట్ వెళ్ళిందా?సెక్రటరీ కి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీల యవ్వారం తెలుసా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.