Sarkar Live

జడ్చర్ల హాస్పిటల్‌లో అమానుషం: మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు! Jadcherla Hospital Incident

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా

Jadcherla Hospital

Jadcherla Government Hospital Incident | మహబూబ్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అతి భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. మార్చురీ గదిలో భద్రపరిచిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం స్పందించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది.

Jadcherla Hospital : అసలేం జరిగింది?

జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్‌ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లగా, లోపల కుక్కల శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఒక కుక్క భీమేశ్ మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది.

వైద్యారోగ్య శాఖ సీరియస్.. నలుగురిపై వేటు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా తేలడంతో, బాధ్యులైన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

ఈ ఘటన (Jadcherla Hospital Incident) పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా ఆయన ఆసుపత్రిని సందర్శించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చురీలో కనీసం ఫ్రీజర్లు కూడా లేవని, మృతదేహాలను నేలపై పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2024 జూన్‌లోనే కొత్త మార్చురీ భవనం పూర్తయినా వాడుకలోకి తీసుకురాకపోవడం అధికారుల అసమర్థతకు నిదర్శనమన్నారు. సీఎం సొంత జిల్లాలో, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం శోచనీయమన్నారు. ఆసుపత్రుల్లో మందులు, కనీస వసతులు కల్పించాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ ఘటన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాలను, సిబ్బంది అలసత్వాన్ని బట్టబయలు చేసింది. బాధ్యులపై సస్పెన్షన్ వేటు పడినా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?