Sarkar Live

Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?

కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా

Thug Life Movie Review

కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కాగా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టిందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ ఫిలిం ఛాంబర్ కోరింది.

దీనిపై కమల్ మాట్లాడుతూ నేను సారీ చెప్పను నేను అన్న దాంట్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ మూవీపై నిషేధం విధించింది. విడుదల దగ్గరపడుతుండగా కమల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలని, థియేటర్ల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కమల్ నే మందలించింది.

మీరేమైనా చరిత్రకారుల…

భాష గురించి మాట్లాడడానికి మీరేమైనా చరిత్రకారుల అని ప్రశ్నించింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెద్ద హీరో అయినా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందే.ఇందుకు ఎవరూ కూడా మినహాయింపు కాదు అని స్పష్టం చేసింది. ఇది సద్దుమణగాలంటే మీరు సారీ చెప్పాలని సూచించింది.

Kamal Hassan : కన్నడ ఫిలిం ఛాంబర్ కి లేఖ…

కానీ కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. సారీ చెప్పను అని అన్నారు.ప్రస్తుతానికి కర్ణాటకలో థగ్ లైఫ్ మూవీని రిలీజ్ చేయడం లేదని తెలిపారు. కాగా కోర్టు తదుపరి విచారణను 10 వ తేదీకి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా కమల్ హాసన్ కన్నడ ఫిలిం ఛాంబర్ కి ఓ లేఖ రాశారు. తనకు అన్ని భాషల మీద ప్రేమ ఉందని, తన వ్యాఖ్యలను వేరే విధంగా అర్థం చేసుకున్నారని తెలిపారు.తన మీద అభిమానంతో వేడుకకు వచ్చిన శివన్న ఇబ్బందులు పడడం బాధ కలిగించిందన్నారు. కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడలేదన్నారు.కానీ అక్కడి కొందరు ప్రముఖులు అలా మాట్లాడడం మాత్రం తప్పనే అంటున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.ప్రస్తుతానికైతే ఈ మూవీ అక్కడ విడుదల కావడం లేదు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?