న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ కోసం భారత్ జోడో యాత్ర లాంటి ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge ) పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన రెండు రోజులకు ఖర్గే ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు దీనిపై అవగాహన కల్పించడానికి భారత్ జోడో యాత్ర స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
తల్కతోరా స్టేడియంలో జరిగిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తారని మోదీ భయపడుతున్నారని అన్నారు.
బీజేపీకి రాజ్యాంగ సమగ్రత లేదని ఖర్గే ఆరోపించారు బిజెపికి “రాజ్యాంగ సమగ్రత లేదా సమాఖ్య లక్షణం” లేదని ఖర్గే ఆరోపించారు.
“మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఎన్నికల గురించి నేను మాట్లాడకూడదనుకుంటున్నానని తెలిపారు. కానీ ఈవీఎంల కారణంగా పేదలు, అణగారిన వర్గాల ఓట్లు వృథా అవుతున్నాయని తెలిపారు. వారందరూ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘ఈవీఎంలను తమ దగ్గర ఉంచుకోనివ్వండి.. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయాలి అని కోరారు.
Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
బ్యాలెట్ పేపర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి మేము ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని, .దీనిపై మేము ఇతర రాజకీయ పార్టీలతో కూడా చర్చిస్తామని ఖర్గే తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీని ఉద్యమం ప్రారంభించాలని కోరారు. బ్యాలెట్ పేపర్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర వంటి ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయన చెప్పారు.
కులగణనపై మోదీకి భయం
కుల గణన చేస్తే ప్రతి ఒక్కరూ తమ వాటాను డిమాండ్ చేస్తారని, మోడీ అహ్మదాబాద్‌కు పారిపోవాల్సి వస్తుందని మోడీకి భయం పట్టుకుంది..” ప్రధానికి నిజంగా దేశంలో ఐక్యత కావాలంటే ఆయనతో పాటు బీజేపీ కూడా విద్వేషాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘కటేంగేకు బాటేంగే’ అంటున్నారు, అయితే దేశాన్ని విడదీస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించి, మతం పేరుతో ప్రజలను విభజించి దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఖర్గే (Mallikarjun Kharge ) మండిపడ్డారు.