Mirai Movie Review : బాలనటుడిగా ఒక స్టార్ స్టేటస్ అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.స్టార్ బాలనటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో తేజ సజ్జా ఒకరు. టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్స్ అందుకున్నాడు. హనుమాన్ లాంటి భారీ హిట్టు తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో యాక్ట్ చేసిన మిరాయి మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
స్టోరీ…
అశోకుడు అందించిన దైవశక్తి గల తొమ్మిది గ్రంథాలను తొమ్మిది మంది యోధులు కాపాడుతుంటారు. వారి తరువాత తరాలు కూడా కాపాడుతుంటారు. కొన్ని ఏండ్ల తర్వాత వాటిని దక్కించుకోవాలని మహాబీర్ లామా(మనోజ్ మంచు)(manchu manoj), అతడి నుండి వాటిని కాపాడాలని వేద(తేజ సజ్జా)(Teja sajja)ప్రయత్నిస్తుంటాడు. ఈ యుద్ధం లో ఎవరు గెలిచారు…? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే….
మూవీ ఎలా ఉందంటే…?
సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ వరకు ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని(karthik gattamaneni)డైరెక్షన్, స్క్రీన్ ప్లే తో అదరగొట్టారు.ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెట్టాడు. ఫస్ట్ ఆఫ్ కథలోకి వెళ్ళడానికి కొద్దిగా టైం పట్టినా, ఆ తర్వాత ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్ ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు.ప్రతీ సీన్ కి తగ్గట్టుగా బిజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ అయ్యాయని చెప్పొచ్చు.ప్రతీ క్యారెక్టర్ కి కూడా పర్ఫార్మెన్స్ చేసేలా స్కోప్ దొరికింది.విజువల్స్ తో ఐ ఫీస్ట్ అనిపించేలా సినిమా తీశారు. ఇక సెకండాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించుకున్న ఆడియన్స్ కి ఏ మాత్రం డిజప్పాయింట్ కాని విధంగా ప్రజెంట్ చేసారు. క్లైమాక్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ మూవీ ఇండియన్ సినిమా లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోయే ఛాన్స్ ఉంది. Mirai Movie Review
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీతో స్టార్ డైరెక్టర్ ల చేరిపోతాడనిపించింది. అంతలా మూవీని తీశాడు. తను ఏదైతే తీయాలనుకున్నాడో తెరపై పదింతలు వచ్చేలా కష్టపడ్డాడనిపించింది. ప్రతీ సీన్ అద్భుతం అనేలా తెరకెక్కించాడు.ఇక హీరో తేజ సజ్జా ఒక్కొక్క సినిమా సూపర్ హిట్టు కొట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోల కు పోటీ ఇచ్చేలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. హనుమాన్ మూవీ తో సూపర్ హిట్టు కొట్టిన ఈ హీరో..ఈ మూవీ లో తన పెర్ఫార్మెన్స్ అలాగే టాప్ లెవల్లో ఉంది.ఇతను మాత్రమే ఇలాంటి మూవీ తీయగలడు అనిపించింది. గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. విలన్ గా చేసిన మనోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.డీ అంటే డీ అనేలా ఇద్దరూ యాక్ట్ చేశారు. రితిక నాయక్ రోల్ తక్కువైనా పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. జయరాం, జగపతి బాబు, శ్రీయ,మిగతా నటీ నటులు వారి వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హనుమాన్ మూవీకి టూ గుడ్ బీజీఎం ఇచ్చిన ఆయన మళ్లీ ఈ మూవీలో అంతకుమించి ఇచ్చాడు. ఇలాంటి మూవీస్ కి తనే కరెక్ట్ అనేలా ఇచ్చాడు.ప్రతీ సీన్ ఎలివేట్ అయ్యేలా, వాటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా మ్యూజిక్ ఉంది. మణి బాబు కరణం మాటలు బాగున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి మిరాయి టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచే ఛాన్స్ ఉంది.
ప్లస్ పాయింట్స్…
- స్టోరీ, స్క్రీన్ ప్లే
- తేజ సజ్జా, మనోజ్ నటన
- మ్యూజిక్
మైనస్ పాయింట్స్
- ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్..
4.5/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    