OTT : వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లే వచ్చాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ లలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కొన్ని ఈ ఏడాది రాబోతున్నాయి.
OTT లోకి ఫ్యామిటీ మాన్ 3
అందులో మొదటి వరుసలో ఉన్నది ఫ్యామిలీ మ్యాన్ (family man). ఉగ్రవాదుల దాడి నేపద్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మనోజ్ బాజ్ పాయి నటన, వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసింది.
దీనికి కొనసాగింపుగానే సీజన్ 2 (familyman-2) వచ్చి మొదటి సీజన్ కంటే ఎక్కువ హిట్ గా నిలిచింది. సమంత (samantha) చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్లో థ్రిల్ ను కలిగించాయి. ఇప్పుడు సీజన్ 3(familyman -3) రాబోతుంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ ట్వీట్ చేశారు. తేదీ ప్రకటించలేదు కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.
అందరూ ఎదురుచూస్తున్న మరొక క్రేజీ వెబ్ సిరీస్ పాతాల్ లోక్ (paathaal lok). మొదటి సీజన్ వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ జనవరి 17 నుంచి ఓటీటీ (OTT Streaming)లో అలరించబోతుంది.
హీరో కొడుకు హీరో అవడం చూస్తుంటాం. కానీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (sharuk khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. అది ఈ సంవత్సరమే స్ట్రీమింగ్ అవ బోతుంది.
బాలీవుడ్లో రోషన్స్ ఫ్యామిలీపై ది రోషన్స్ (The Roshan’s) అనే ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అది ఈ నెల 17న రాబోతుంది. కాజోల్ (Kajol) యాక్ట్ చేసిన ది ట్రయల్ (The Trial) అనే వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కూడా ఈ సంవత్సరమే రాబోతుంది. అలాగే విజయ్ వర్మ (Vijay varma)యాక్ట్ చేసిన మట్కా కింగ్ (Matka king) వెబ్ సిరీస్ కూడా అలరించబోతోంది.
ఈ సంవత్సరం ఇలా క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చి దుమ్ము రేపబోతున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకొని మునుపటి సీజన్లల అలరిస్తాయో లేదో చూడాలి….
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..