Sarkar Live

Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న

Pahalgam Attack

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్

Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారతీయ ప్రవాసులు బెర్లిన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్రాండెన్‌బర్గ్ గేట్, బెర్లిన్ డోమ్, హంబోల్ట్ ఫోరం వంటి నగరాల్లో నిరసనకారులు కవాతు చేశారు. వీరి నిర‌స‌న‌ల‌తో స్థానిక పౌరులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు.

Pahalgam Attack : ఉగ్ర దాడిని వ్యతిరేకిస్తూ నిరసనలు

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, బ్రిట‌న్ లోని భారతీయ సంత‌తి ప్ర‌జ‌లు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి భారతదేశానికి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా, ఏప్రిల్ 28న సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన పౌరులను నివాళుల‌ర్పించేందుకు, వారి ఆత్మ‌శాంతికి క‌ల‌గాని కోరుతూ వార్సాలోని హిందూ దేవాలయం, గురుద్వారా సింగ్ సభ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి.

బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేయడానికి హిందూ దేవాలయంలో గరుడ పురాణ పారాయణం నిర్వహించింది. పోలాండ్ లోని వార్సాలో తమిళ సంఘం, తెలుగు సంఘం, సింధీ సంఘం, పంజాబీ సంఘంతో సహా వివిధ భారతీయ ప్రవాస సంఘాల అధిపతులు, సభ్యులు పాల్గొన్నారు. సంఘ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు.

ఇక ఫ్రాన్స్‌లోని భారతీయ ప్రవాసులు ఐఫెల్ టవర్ ముందు గుమిగూడి, పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తోందని, మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి (Pahalgam Attack) లో 26 మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడిన బాధితులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు భారతీయ ప్రవాసులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?