- గుర్తించలేని స్థితిలో మృతులు..
- డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం (Pasmailaram ) పారిశ్రామికవాడలోని సిగాచి క్లోరో కెమికల్స్ భారీ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కొందరు భావిస్తున్నారు.NDRF, HYDRAA, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
వివిధ ఆసుపత్రులలో 35 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బహుశా, ఇది తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా పలువురు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వం అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది.
Pasmailaram Blast : గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు
కాగా ప్రమాదం (Sigachi Explosion) లో మరణించినవారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో డీఎన్‌ఏ పరీక్షల (DNA Identification) ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరో 27 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సిగాచి ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసకర పేలుడు తర్వాత కనిపించకుండా పోయిన నలుగురు కుటుంబ సభ్యులు – ఆమె భర్త, ఇద్దరు మామలు, ఆమె సోదరుడి ఆచూకీ గురించి బీహార్‌కు చెందిన ఏడు నెలల గర్భవతి పూజా కుమారి అక్కడ పరిసరాలను ఏడుస్తూ వెతుకుతుండడం అందరినీ కన్నీరుపెట్టించింది. తనవారి గురించి ఏదైనా సమాచారం అందుతుందేమోనని ఆమె కన్నీళ్లతో, ప్రమాద స్థలంలో అధికారులను వేడుకుంటుంది, కానీ ఇప్పటివరకు ఆమె విన్నపాలకు సమాధానం రాలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.