పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Power Star Pawan Kalyan, Ramana Gogula combo) కాంబో ఒకప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమణ గోగుల వాయిస్ పవన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది.పవన్ మూవీల్లో తమ్ముడు (thammudu) మూవీకి ఫస్ట్ టైమ్ రమణ గోగుల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అందులో అన్ని సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత వచ్చిన బద్రి, జానీ, అన్నవరం (Badri, Jani, Annavaram)లో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఆ మూవీల్లో సాంగ్స్ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ గా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ మూవీ కి రమణ గోగుల నే సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ మూవీ ఫ్లాఫ్ అయినా మ్యూజికల్ హిట్టు గా నిలిచింది.
19 ఏళ్ల తర్వాత రమణ గోగుల..
అన్నవరం మూవీ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు.అయితే 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాలో రమణ గోగుల పనిచేయబోతున్నాడట. అయితే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ గా కాదు..సింగర్ గా పవన్ కి పాట పాడుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (usthad bhagath singh) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)మ్యూజిక్ అందిస్తున్నారు.
గబ్బర్ సింగ్ కి మించి….?
గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సాంగ్స్ లో ఎంత ఊపు ఉంటుందో తెలిసిందే. గబ్బర్ సింగ్ లో అన్ని పాటలు హైలెటే. ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆడియన్స్ ఆ రేంజ్ లో సాంగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు.వారి అంచనాలకు మించి సాంగ్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దేవీ ఓ సాంగ్ గురించి మాట్లాడుతూ…సాంగ్ విని పవన్ కి చాలా రోజుల తర్వాత డాన్స్ చేయాలనిపించింది అని చెప్పారని చేసిన కామెంట్ తో మూవీ లో సాంగ్స్ ఏ రేంజ్ లో మారు మోగుతాయో అని ఊహించుకుంటున్నారు.
వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్..?
చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల (Ramana Gogula) రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ మూవీలో సాంగ్ పాడి అలరించాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్ వింటేజ్ పవర్ స్టార్ ను గుర్తుకు తెచ్చేలా అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. చూద్దాం ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








