Sarkar Live

Privacy Policy

Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..
State, Karimnagar

Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..

Karimnagar News | ఏసీబీ అధికారులు ఒక వైపు దాడులు ముమ్మ‌రం చేస్తున్నా.. ఏదో ఒక‌చోట అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. చిన్న ప‌నుల‌కు కూడా పెద్ద మొత్తంలో లంచం (Bribe) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణ‌వంక (Veenavanka) మండ‌లంలో పంచాయతీ కార్యదర్శి కంబం నాగరాజు చల్లూర్ గ్రామంలో ఇంటి నెంబర్ కేటాయించ‌డానికి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెప్పిన టైం లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల‌ని స‌ద‌రు కార్య‌ద‌ర్శి చెప్పాడు. దీంతో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వ...
Tollywood News | ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా బాబూ…
Cinema

Tollywood News | ఇదెక్కడి మాస్ కాంబినేషన్ రా బాబూ…

Tollywood News : ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఆడియన్స్ ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి.అలా సెట్ చేసిన డైరెక్టర్ సెన్సేషనల్ హిట్స్ తీసుంటే ఆ కాంబో మీద హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఓ మాస్ కాంబినేషన్ సెట్ అయినట్టు ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది.రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా (Rebal Star Prabhas, Sandeep Reddy Vanga combo..) కాంబినేషన్ లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. మూవీకి స్పిరిట్(spirit)అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రభాస్ ఒక కాప్ గా కనిపించబోతున్నారు.భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. Tollywood News : భారీ బడ్జెట్ తో సినిమాలు.. అంతకంతకు వసూళ్లు…. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి.బడ్జెట్ ఎన్ని కోట్లయినా సరే ప్రొడ్యూసర్స్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే వారు పెట్టిన దానికి అంతకు రె...
Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..
State

Raja Singh : ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తా..

Hyderabad : స్వతంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీకి సమావేశాలకు హాజరవుతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. ‘ఒకప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలన్నా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉండేది. బీజేపీ సభలో మాట్లాడే అవకాశమే ఇచ్చేది కాదని ఆయన తెలిపారు.. ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కువ. నాలాగే చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణ చేవెళ్ల ఎంపీ వ్యవహరమే’ అని తెలిపారు. కాగా ఇటీవలే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పార్టీ అగ్ర నాయకత్వానికి ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపిన విషయంపై రెండురోజుల క్రితం రాజా సింగ్ స్పందించారు. భారీ మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ ఎంతగా మనస్తాపానికి గురైతే అలాంటి పని చేస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంప...
Holidays | వర్షాల ఎఫెక్ట్..  13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
State, Hyderabad

Holidays | వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

వ‌రంగ‌ల్‌ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. ‌అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, ‌సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 ‌వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల  పాఠశాలలు, కళాశాలలు బంద్‌ ‌కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు ...
Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
Districts, State

Weather News | నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Weather News | రాష్ట్రంలో కుండ‌పోత‌ వర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వ‌ర్షాల‌తో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కాల‌నీలు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. అయితే మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్న వాతావరణ శాఖ (IMD) హెచ్చరించ‌డంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ‌లోని మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో గురువారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ...
error: Content is protected !!