Privacy Policy
23JunNo Comments
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచరిచడం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోందని తెలియడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వణికిపోతు న్నారు. తాజాగా బోథ్ మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొందరు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
కాగా బోథ్ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
23JunNo Comments
Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..
నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర…
అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం
అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి?
విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి?
Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ...
22JunNo Comments
Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచలన నిర్ణయం.. భారత్ – చైనాపై తీవ్ర ప్రభావం
అమెరికా దాడి తర్వాత, ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్, చైనాపై భారీ నష్టం కలుగనుంది. అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Hormuz Strait )ని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు పంపి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా నష్టపోతాయి. ఇది మాత్రమే కాదు, ఈ జలసంధి ద్వారా తమ చమురును ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ నిర్ణయం ఇరాన్ అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి పెద్ద ప్రభావాన్ని చూపదు.
హార్ముజ్ జలసంధి (Hormuz Strait ) అంటే ఏమిటి?
ఇది ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న ఇరుకైన అతి ముఖ్యమైన జలమార్గం. ఈ జలసంధి ఉత్తరాన పర్షియన్ గల్ఫ్‌ను దక్షిణాన ఒమన్ గల్ఫ్‌తో కలుపుతుంది. ఇది అరేబియా సముద్రంలోకి విస్తరించి ఉంది....
22JunNo Comments
Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది.
మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
