Bus Accident | బస్సు – లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!
చిత్రదుర్గ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 (NH-48)పై ప్రైవేట్ బస్సు - లారీ పరస్పరం (Bus Accident) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి శివమొగ్గకు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'సీ బర్డ్' (Sea Bird) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలోని గోర్లాతు గ్రామం వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మంటల్లో చిక్కుకున్న వాహనాలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణ...




