భార్య, ఇద్దరు బిడ్డలను ముంచేసిన కాలయముడు! పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీ ఛేదించిన పోలీసులు -Swimming Pool Murder
పరాయి మోజులో పడి కన్నబిడ్డలనే కాల యముడైన అజారుద్దీన్
లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన డాక్టర్లతో సహా 10 మంది అరెస్ట్
వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించిన సంచలన నిజాలు
Punnelu Swimming Pool Murder case | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పున్నెలు స్విమ్మింగ్ పూల్ హత్యోదంతం మిస్టరీని వరంగల్ పోలీసులు ఛేదించారు. భార్య, ఇద్దరు కూతుళ్లను ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించి, అత్యంత కిరాతకంగా స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపిన భర్త అజారుద్దీన్‌తో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు లేడీ డాక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
అసలేం జరిగింది?
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ (29), అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అ...




