TS DOST 2025 : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్.. దరఖాస్తు విధానం ఇదే..
TS DOST 2025 : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) అధికారికంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTUH, మహిళా విశ్వ విద్యాలయంతో సహా వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ఆన్‌లైన్ ప్రవేశాల కోసం విద్యార్థులకు అవకాశం కల్పించింది.
TS DOST 2025 దరఖాస్తు విధానం ఇదే..
ప్రవేశ ప్రక్రియ మూడు దశలుగా ఉటుంది.
దశ 1: ₹200 రుసుముతో మే 6 నుండి మే 25, 2025 వరకు రిజిస్ట్రేషన్. మే 15 నుంచి మే 27 మధ్య వెబ్ ఆప్షన్లు వేసుకోవచ్చు. జూన్ 3న సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. ఆ తర్వాత జూన్ 4 నుంచి జూన్ 10 వరకు ఆన్‌లైన్ స్వీయ-నివేదన ఉంటుంది.దశ 2: ₹400 రుసుముతో జూన్ 4 నుంచి జూన్ 13, 2025 వరకు రిజిస్ట్రేషన్. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు వెబ్ ఆప్షన్స్.. జూన్ 18న సీ...




