Sarkar Live

Privacy Policy

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025
Hyderabad, State

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025

Miss World 2025 | హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కక్కరుగా వస్తున్నారు.. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈనెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో (Ms.Jessica Scandiuzzi Pedroso (Brazil) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా మిస్- వరల్డ్ (Miss World 2025) పోటీల్లో పాల్గొనేందుకు మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ ( Ms. Emma Deanna Cathryn Morrison,) నిన్ననే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ...
తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses
Career

తెలంగాణ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses

New Degree courses : హైదరాబాద్: విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ‌లోని 28 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు (GDCలు) 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నాయి. New Degree courses : కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవీ.. BCom బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI), BCom E-కామర్స్ ఆపరేషన్స్, BCom రిటైల్ ఆపరేషన్స్, BSc టూరిజం & హాస్పిటాలిటీ ఆపరేషన్స్, BSc డిజిటల్/ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, BSc మార్కెటింగ్ & సేల్స్, BSc ఇన్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ & క్వాలిటీ BBA ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్. తెలంగాణ‌ రాష్ట్రంలోని యువ‌త‌కు ఉపాధిని పెంచడం, నైపుణ్య ఆధారిత విద్యను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కొత్త కోర్సు(New Degree courses)ల‌ను ప్రార...
PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?
Business

PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?

PM-KISAN 20th Installment : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 20వ విడత త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు రూ. 2000 సహాయం అందించనున్న విష‌యం తెలిసిందే.. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఈ ఇన్‌స్టాల్‌మెంట్‌ జూన్ 2025 లో వచ్చే అవకాశం ఉంది. PM-KISAN సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి? ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) అనేది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ముఖ్య‌మైన ప‌థ‌కం. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులకు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి చిన్న వ్యవసాయ అవసరాలకు సహాయం చేస్తూ.. రైతుల ఆదాయానికి స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద...
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools
State

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools

Khammam : రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేదస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్దేశం అన్నారు. సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా విద్యా బుద్ధులు చెప్పే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రవ్యాప్తంగా...
Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు
World

Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారతీయ ప్రవాసులు బెర్లిన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్రాండెన్‌బర్గ్ గేట్, బెర్లిన్ డోమ్, హంబోల్ట్ ఫోరం వంటి నగరాల్లో నిరసనకారులు కవాతు చేశారు. వీరి నిర‌స‌న‌ల‌తో స్థానిక పౌరులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు. Pahalgam Attack : ఉగ్ర దాడిని వ్యతిరేకిస్తూ నిరసనలు 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, బ్రిట‌న్ లోని భారతీయ సంత‌తి ప్ర‌జ‌లు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి భారతదేశానికి సంఘీభావం తెలియజేశారు...
error: Content is protected !!