UPI services down | యూపీఐ సేవలకు అంతరాయం.. యూజర్లు బేజారు
UPI services down : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface (UPI) సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు డిజిటల్ (Digital) లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు (suffered) ఎదుర్కొన్నారు. ఈ సేవల ద్వారా చేసే షాపింగ్, బిల్లు చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వినియోగదారులు తాము పేమెంట్ చేయలేకపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించారు.
UPI services down : ఏం జరిగింది?
డిజిటల్ లావాదేవీలపై నిఘా వేసే “Down Detector” అనే వెబ్‌సైట్ ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 2,358 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 81 శాతం సమస్యలు పేమెంట్ వ్యవహారాల్లో కాగా, 17 శాతం ఫండ్ ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి ఉన్నాయి. ఈ అవాంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.
స్పందించి...



