అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు భక్తుల మృతి – Simhachalam Temple Tragedy
Simhachalam Temple Tragedy : సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం సమయంలో అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయకసిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కేజీహెచ్ హాస్పిటల్‌కి తరలించారు.
Simhachalam : భారీ వర్షంతో కూలిన గోడ
సింహాచలం చందనోత్సవం సమయంలో భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ కట్టారు. అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గోడ నిర్మించారు. ఆ గోడ పక్కన...




