HSRP | రవాణా శాఖ కీలక నిర్ణయం.. ఇకపై వెహికల్స్‌కు ఇది తప్పనిసరి
HSRP must : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (Telangana Transport Department) ఓ కీలక చర్యలకు సిద్ధమైంది. 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనంపై తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (High-Security Registration Plates (HSRP) ఉండాలనే నిబంధనను అమల్లోకి తేనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పంపింది. ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
HSRP అంటే ఏమిటి?
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ఒక ప్రత్యేక నంబర్ ప్లేట్. ఇది ఏమాత్రం బెండ్ కాని (tamper-proof), స్టాండర్డైజ్డ్ విధానంతో తయారవుతుంది. ఇందులో ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. వీటివల్ల వాహనం కదలికలు, దొంగతనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని వాహనాలపై ఒకే విధమైన నంబర్ ప్లేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. హైడ్రోక్రోమిక్ స్టికర్, లేజర్ కోడ్, రివెట్ పిన్ వంటి ఫీచర్లు వ...




