Actress attacked | బాలీవుడ్ నటిపై దాడి.. హైదరాబాద్‌లో కలకలం
Actress attacked : ఓ బాలీవుడ్ నటి (Bollywood actress) హైదరాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్ గదిలో దాడికి (attacked) గురైంది. ఒక షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన ఆమెపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన నగదు, విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూడగా బాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ వ్యక్తులకు సరైన భద్రత లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
శారీరకంగా హింసించి దోపిడీ
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు హోటల్ గది (hotel room) లోకి అక్రమంగా ప్రవేశించి నటిపై దాడి చేశారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. నటిపై వీరు దాడి చేసి ఆమె వద్ద ఉన్న నగదు, విలువైన ఆభరణాలను దోచుకుని పారిపోయారు. దుండగ...




