Sarkar Live

Privacy Policy

Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం
Crime

Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం

Accident in Mahabubabad : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట గ్రామంలోని పెద్దనగరం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇతరులకు స్వల్పంగానే కానీ రక్తస్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. బాధితులందరూ రోజువారీ కూలీ కార్మికులు, చెర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు.. మిర్చి కోత పనికి ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు. పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం (Tragic incident) చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వార...
SLBC Tunnel : ప్రమాదం జరిగి 28వ రోజు.. ఏడుగురి కోసం నిర్విరామంగా  గాలింపు చర్యలు..
Crime

SLBC Tunnel : ప్రమాదం జరిగి 28వ రోజు.. ఏడుగురి కోసం నిర్విరామంగా గాలింపు చర్యలు..

SLBC Tunnel collapse : శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం పాక్షికంగా కూలిపోయిన విషాదకర ఘటనలో లోపల చిక్కుకున్న ఏడుగురి కోసం గాలింపు చర్య నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గల్లంతయినవారి కోసం అనుమానం ఉన్న ప్రదేశాల నుంచి సహాయక సిబ్బంది ఉక్కు, మట్టిని అత్యాధునిక యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. పెద్ద రాళ్లను తొలగింపు ఎస్కవేటర్లు, ఇతర యంత్రాలు, 'లోకో రైలు' ఉపయోగించి సొరంగం నుండి పెద్ద రాళ్లను తొలగిస్తున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటి ఊట నిరంతరం విపరీతంగా రావడంతో సహాయక చర్యలకు సవాళ్లు ఏర్పడుతున్నాయి. నేల స్థిరత్వానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి నిపుణులను పిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తు నిర్వహణ) అరవింద్ కుమార్ పరిశోధన ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఐదు షిప్టులుగా సహాయక చర్యలు ...
Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?
Cinema

Puri Jagannadh | పూరీ ఈసారి బెగ్గర్…?

వెండితెరపై హీరోయిజాన్ని ఓ లెవల్లో చూపించే డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). ఒకప్పుడు ఈయన డైరెక్షన్ లో మూవీ చేయడానికి హీరోలు ఎదురుచూసేవారు. చాలా మంది హీరోలను తన డైలాగ్ లతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు.ప్రజెంట్ పూరీకి బ్యాడ్ సిట్యువేషన్ నడుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన తీసిన మూవీస్ అన్ని అట్టర్ ప్లాప్ లు అవుతున్నాయి. Puri Jagannadh : ఇస్మార్టే ఆఖరి హిట్టు.. రామ్ (ram)తో తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్టు తర్వాత ఈయన తీసిన ఏ మూవీ సరిగా ఆడలేదు. విజయ్ దేవరకొండ(vijay Devarakonda)తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా దారుణంగా నిరాశ పరిచింది. పూరీ కంబ్యాక్ అయ్యడనుకున్న ఆడియన్స్ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ డిజాస్టర్ లతో సంబంధం లేకుండా పూరీ మూవీస్ ని ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ...
Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..
State

Telangana’s vehicle | తెలంగాణ‌లో పెరిగిన వాహ‌నాల వినియోగం.. ఏ స్థాయిలో అంటే..

Telangana’s vehicle : తెలంగాణలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2025 ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో నమోదైన వాహనాల సంఖ్య (registered vehicles) 1.72 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర జనాభా 3.7 కోట్లు కాగా సగటున ప్రతి ఇద్దరికి ఒక వాహనం ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ (State Transport Department) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఈ సంఖ్య వృద్ధి చెందడంలో నగరాల విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆదాయ స్థాయిలో పెరుగుదల కీలక కారణాలుగా పేర్కొంది. ఏయే వాహ‌నాలు ఎన్నెన్ని? తెలంగాణ వ్య‌ప్తంగా ఉన్న‌ వాహ‌నాల్లో అత్య‌ధికంగా మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇవి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కార్లు, క్యాబ్‌లు 20 శాతం ఉండగా, మిగిలిన 10 శాతంలో ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, ఆటోలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వాహనాలను విభజిస్తే, 1.2 కోట్ల మోటార్‌సైకిళ్లు, 23.3 లక్షల కా...
Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..
State

Betting Apps | సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు.. నేరం ఏమిటంటే..

Betting Apps : ప్రముఖ టాలీవుడ్ (Tollywood) నటులు రానా దగ్గుబాటి (Rana Daggubati), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా పలువురిపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరు సోషల్ మీడియా వేదికగా పాప్అప్ ప్రకటనల ద్వారా బెట్టింగ్ యాప్స్ (betting apps)ను ప్రచారం చేసినట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ (Miyapur)కు చెందిన వ్యాపారి పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు అయింది. గేమింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు బెట్టింగ్, జూదం, కాసినో యాప్స్‌లో యువ‌త డ‌బ్బులు పెట్ట‌డాన్ని ఈ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ప్రోత్స‌హిస్తున్నార‌ని (promoting) ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు 318(4), 112 రీడ్ విత్ 49 బీఎన్‌ఎస్, తెలంగాణ గేమింగ్ చట్టం కింద సెక్షన్ 3, 3(ఎ), 4, ఐటీ చట్టం సెక్షన్ (డీ) ప్ర...
error: Content is protected !!