Sarkar Live

Privacy Policy

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం
State

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో మరో ముంద‌డుగు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాన‌ని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన ...
Telangana education | తెలంగాణ విద్యారంగంలో విశేష మార్పులు.. తాజా నివేదిక‌
State

Telangana education | తెలంగాణ విద్యారంగంలో విశేష మార్పులు.. తాజా నివేదిక‌

Telangana education sector : రాష్ట్ర విద్యా రంగంలో విశేష మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యావ‌న‌రులు, ప్ర‌మాణాలు మెరుగుప‌డ్డాయ‌ని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక అవలోకనం -2025 (Socio-Economic Outlook) నివేదిక చెబుతోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ రిపోర్టు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కొత్తగా ఏర్పాటవుతున్న విద్యా సంస్థలు, విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు వంటి అంశాలు సమగ్రంగా వెల్లడయ్యాయి. తెలంగాణ విద్యా రంగం (Telangana education sector) మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని నివేదిక చెబుతోంది. ప్ర‌భుత్వ విద్యావ్య‌వ‌స్థ బ‌లోపేతానికి కృషి రాష్ట్ర వ్యాప్తంగా 1.94 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నార‌ని ఈ నివేదిక చెబుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో 3.635 కోట్ల మంది ఉన్నార‌ని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు...
TG Weather Report : ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లని కబురు
State

TG Weather Report : ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లని కబురు

22 నుంచి 25 వరకు కురిసే అవకాశం హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి TG Weather Report : వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే సూర్య ప్రతాపానికి ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ మండుటెండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా, బుధవారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యా...
Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..
Trending

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్‌లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్‌గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టూర్లు భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్‌గునీ పాండ్యా తెలిపారు. డ్ర...
Telangana Budget : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
Business

Telangana Budget : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

Telangana Budget : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం 2025-26 సంవత్సరానికి దాదాపు రూ.3.05 ట్రిలియన్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధాన కేటాయింపులు సంక్షేమ పథకాలకు మళ్లించారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా అంచనా వేసినట్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక పత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. "2025-26 ఆర్థిక సంవత్సరానికి, మొత్తం ఖర్చును రూ.3,04,965 కోట్లకు ప్రతిపాదిస్తున్నామని, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లు" అని డిప్యూటీ సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది, ఇందులో రైతు భరోసా పథకం కూడా ఉంది. దీని కింద ప్రతి రైతుకు ఎకరానికి ఏటా రూ.12,000 పెట్టుబడి మద్దతుగా పొందనున్నారు. అలాగే రైతుల నుండి సేకరించిన సన్న ర...
error: Content is protected !!