Felicitated a bore well | బోర్‌వెల్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానం ఎందుకో తెలుసా?
Felicitated a bore well : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ పట్టణంలో ఈ రోజు ఓ విశేషం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా తమకు నిరంతరంగా నీళ్లు అందిస్తున్న బోర్‌వెల్ (హ్యాండ్‌పంప్)ను ప్రజలు సన్మానించి కృతజ్ఞతను చాటుకున్నారు. 1995లో తవ్విన ఈ బోరు నిత్యం తాగునీటి కొరతను తీరుస్తోందని మైసమ్మకాలనీ (Maisamma colony) వాసులు ఈ మేరకు సత్కరించారు. పసుపు రాసి, పూలమాల వేసి, కొబ్బరికాయలు కొట్టి శాలువా కప్పారు. ఈ అరుదైన ఘట్టం (felicitated a bore well) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతికూల పరిస్థిత్తుల్లోనూ నిరంతర సేవలు
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన వేసవిలోనూ ఈ బోర్‌వెల్ ఎప్పుడూ ఎండిపోకుండా ఈ బోర్‌వెల్ తమ దాహాన్ని తీరుస్తోందని స్థానికులు తెలిపారు. పట్టణంలో అనేక నీటి వనరులు అడుగంటిపోయినా మైసమ్మ కాలనీలోని ఈ బోరు మాత్రం నిరంతరంగా ఎలాంటి మరమ్మతులకు గురిక...




