TGSRTC special buses | మహాశివరాత్రికి ప్రత్యేక బస్సు సర్వీసులు
TGSRTC special buses : మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాలకు 3 వేల సర్వీసులను నడించనుండగా ఇవి ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు అందుబాటులోకి రానున్నాయి.
TGSRTC special buses : ఎక్కడెక్కడికి అంటే...
గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 800 కి పైగా అదనపు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 43 ప్రముఖ శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, కీసరగుట్టకు 270, ఎడుపాయకు 444. వెలాలకు 171 బస్సులు, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్త...




