Cyber Crime | ఎమ్మెల్యేపై సైబర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్
Cyber Crime : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమయాకులను తమ ఉచ్చులో బిగించేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా మోసం (Cyber Crime) చేసి డబ్బులు దండుకుంటున్నారు. సామాన్యులనే కాకుండా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సైతం టార్గెట్ చేయడం కలవర పెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేపై కూడా సైబర్ ఎటాక్ జరగడం కలకలం రేపింది. న్యూడ్ వీడియోలు పంపిన క్రిమినల్స్ ఆయన్ను బెదిరించి (blackmail) డబ్బులు దండుకోవడానికి యత్నించారు.
సైబర్ ఎటాక్ బారిన పడ్డ ఎమ్మెల్యే ఎవరు?
తెలంగాణ (Telangana)లోని నల్లగొండ జిల్లా నక్రేకల్ (Nakrekal ) ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (MLA Vemula Veeresham) టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన సెల్‌ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని అశ్లీల వీడియో కాల్ చేశారు. ఒక వ్యక్తి నగ్నంగా కనిపించేలా చేసి కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డ...




