Sarkar Live

Privacy Policy

Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా
State

Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా

అమరావతి : ప్రముఖ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Quash petition) పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో (AP High Court) విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు త‌గిన‌ సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర‌డంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఆర్జీవీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!? ఏపీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu), ఉప‌ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఫొటోలను మార్ఫింగ్ (Photos Marfing) చేసి సోష‌ల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను రాంగోపాల్‌ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు రెండుసార్లు నోటీసులు అందించినా కూడా వ...
SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!
Crime

SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!

SUICIDE IN GURUKULA SCHOOL వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ తో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్ప‌డుతుండ‌డం కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు గురుకులాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకుల పాఠ‌శాల‌ (SOCIAL WALFAR SCHOOL) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్మ‌కు పాల్ప‌డ‌డం తీవ్ర‌ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానకులు మండిప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు - సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకుని శ్రీనివాసులు దంపతులు పిల్లలను ప్రభు...
Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు
Crime

Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi)లో గురువారం ఉద‌యం ఒక్కసారిగా భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రశాంత్‌ విహార్‌ (Prashant Vihar) ప్రాంతంలోని పీవీఆర్‌ (PVR) మల్టీప్లెక్స్‌ సమీపంలో గల ఓ స్వీట్‌ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి స‌మీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఉదయం 11:48 గంటల ప్రాంతంలో స్వీట్‌ షాప్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వెంట‌నే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్ట‌గా తెల్లటి పొడి వంటి పదార్థం ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. Also Read |  Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక ఘటనా స్థలంలో పేలుడుకు సంబంధించి వచ్చిన కాల్‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. పే...
KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
State

KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?

KTR | హైదరాబాద్‌: ప్ర‌భుత్వ పాఠ‌శాల పిల్లలకు అండ‌గా నిలిచిన భార‌త‌రాష్ట్ర స‌మితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులను అరెస్టు చేయ‌డం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు త‌క్ష‌ణ‌మే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం విద్యార్థి నేత‌ల‌ను అరెస్టు చేసి ఇప్పటికీ వారి ఆచూకీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయ‌న‌ మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా?, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ‌తారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాల గురించి నిల‌దీస్తే గొంతు నొక్కుతారా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మా బీఆర్ఎస్‌వి నాయకులు ‘గురుకుల బాట’ చే...
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక

Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది. హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వ...
error: Content is protected !!