Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో పోటెత్తున్న శివాలయాలు
హైదరాబాద్: మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బుధవారం ఉదయం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలిరావడం మొదలైంది. శివుడికి భక్తిశ్రద్ధలతో మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహదేవుడి దర్శనం కోసం ఎండను సైతం లెక్కచేయకుండా భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి.
Vemulawada Rajanna Temple : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ...




