Revenue Deportment | రెవెన్యూలో అవినీతి తిమింగలాలు..?
ఆ తహసీల్దార్లు అక్రమంగా కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు
Corruptions in Revenue Deportment | రెవెన్యూ శాఖ లో అవినీతి తిమింగలాలు …అదేంటి తిమింగలాలు సముద్రంలో కదా ఉండేది, రెవెన్యూ శాఖలో ఉండడమేంటి అని అనుకుంటున్నారా…? అవునండి ఇది నిజం సముద్రంలో ఉండే తిమింగలాలకు ఏ మాత్రం తీసిపోకుండా రెవెన్యూ శాఖలో అవినీతి (Corruption) తిమింగలాలు దర్జాగా విధులు నిర్వహిస్తున్నాయి. సముద్రంలో ఉండే తిమింగలాలు సముద్రంలో జీవిస్తున్న చిన్నాచితకా జీవులను తింటుంటే, సమాజంలో మండల మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న కొంతమంది తహసీల్దార్ (Tahsildar)లు ప్రజల రక్తాన్ని మామూళ్ల రూపంలో తాగుతూ రెవెన్యూ శాఖ (Revenue Deportment) లో అవినీతి తిమింగలాలుగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది.
కలిసొచ్చిన "ధరణి"
తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం "ధరణి (Dharani) " న...




