Secunderabad station | సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి
Secunderabad Railway station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. ప్రయాణికులకు సరికొత్త హంగులతో మరిన్ని సౌకర్యాలను పెంచేందుకు పునర్నిర్మాణం సాగుతోంది. ఈ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే శాఖ (South Central Railway-SCR) పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా ప్రయాణికులు స్టేషన్ (Secunderabad station) లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఉన్న మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Secunderabad station | కొత్త మార్గాలు ఇవే..
ఫ్లాట్‌ఫామ్ నంబర్ 1: గణేష్ ఆలయం పక్కన గేట్ నంబర్ 2 వద్ద కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులు స్టేషన్‌లోకి సులభంగా ప్రవేశించేందుకు సహాయపడుతుంది.
గేట్ నంబర్ 4: ఈ గేటును మూసివేశారు. స్వాతి హోటల్ ఎదురుగా గేటు నంబర్ 3తోపాటు 3బీ అనే అదనపు ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రయ...




