Sarkar Live

Privacy Policy

IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌
Career

IB Vacancy 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు- 362 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌

IB Vacancy 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau Recruitment -IB)లో కొత్తగా భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) విభాగంలో మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Central Government Recruitment) ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబరు 14 వరకు స్వీకరించనున్నారు. అర్హతలు, వయోపరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప‌దో తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 -25 ఏళ్ల‌ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది. IB Vacancy 2025: ఎంపిక ప్రక్రియ IB మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాల్లో ఎంపిక పలు దశల్లో నిర్వహించబడనుందని అధికారులు వెల్లడించారు. -ముందుగా టైర...
Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!
State

Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!

మారేడుమిల్లి (AP) వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి Naxal Operation in Maredumilli | ఆంధ్రప్రదేశ్‌ మారేడుమిల్లి సమీపంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్ అగ్రనేత మద్వి హిద్మా హతమైన 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ జరుగడం కలకలం రేపింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం జరిగిన ఆపరేషన్‌ కొనసాగింపుగా తాజా ఢీకొనులో ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలని గుర్తించారు. మృతుల్లో ఒకరిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేటూరి జోఖా రావు అలియాస్ శంకర్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆయన AOB డివిజన్‌లో ACMగా పనిచేసి, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్, సాంకేతిక కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలుగా అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయిన టా...
Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?
State

Telangana : మ‌ధ్యాహ్న భోజ‌నానికి నిధుల విడుదల- ఏయే జిల్లాకు ఎంతెంత ?

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేల‌కు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుద‌లైన నిధులు ఇలా.. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖ‌ర్చు కోసం రూ. 34.91 కోట్లు, క‌మ్యూనిటీ కుకింగ్ హెల్ప‌ర్స్‌కు రూ.10 కోట్లు విడుద‌ల చేసింది. సహాయకులైన హెల్పర్స్‌కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.ప్రభుత్వం విడుదల...
IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు
Crime

IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు

IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసి పోయాయి. గ‌ర్భంలో ఉండ‌గానే క‌వ‌ల (twins) శిశువులు మృతి చెంద‌గా, కాసేప‌టికే త‌ల్లి తీవ్ర అస్వ‌స్త‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిన్న‌ఉద‌యం చోటుచేసుకోగా పూర్తి వివ‌రాలు ఈరోజు వెల్ల‌డ‌య్యాయి. ఆనందం.. అంత‌లోనే… శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివ‌సిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. వివాహ‌మై కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ అవుతున్నా వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ స‌ల‌హా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్ల‌లు పుడతార‌ని చెప్ప‌డంతో ఓ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ వైద్యం పొందిన శ...
మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter
AndhraPradesh

మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter

Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదుర‌ప‌డ‌డంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు స‌మాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా...
error: Content is protected !!