Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?
ఆనందంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు?
బిల్లులు పెట్టాలంటే ముట్టజెప్పాల్సిందేనని గుసగుసలు?
పీజీ విద్యార్థులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం?
Corruptions in Govt Hospital : ఆ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant ) హవా మాములుగా ఉండటంలేదట.ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ కంటే కూడా సదరు జూనియర్ అసిస్టెంటే పవర్ ఫుల్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆసుపత్రినంతా కూడా సదరు ఉద్యోగి తన కనుసన్నల్లోనే ఉంచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదట. బిల్లులు చేసే క్రమంలో తోటి ఉద్యోగులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.తరగతులకు హాజరుకాని పీజీ విద్యార్థులను ఒక్కొక్కరూ 30 వేలు చెల్లించాల్సిందేనని హుకుం జారిచేశాడని, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక లోలోపలే మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతినెలా ఉద్యోగుల జీతాలు చేయ...




