Sarkar Live

Privacy Policy

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..
State

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..

Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మ‌ధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు (MLC Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్‌ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడ‌తారు. ఫలితాల‌ను కూడా అదే రోజు విడుద‌ల చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎక్క‌డెక్క‌డంటే.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతోపాటు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్ల‌గొండ‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానుండ‌గా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన...
ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..
Technology

ISRO | ఇస్రో 100వ ప్ర‌యోగం స‌క్సెస్‌.. ప్రయోజ‌నాలు ఏమిటంటే..

ISRO New Mission 2025 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) బుధవారం తన 100వ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) రాకెట్ ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్‌ను ఈ మిష‌న్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూభాగం, వాయు, సముద్ర నావిగేషన్, ఖచ్చితమైన వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఉపయోగకరంగా ఈ శాటిలైట్ ఉంటుంది. ఇస్రో కొత్త చైర్మన్ వి. నారాయణన్ (ISRO Chairman V Narayanan) నేతృత్వంలో జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఆయన జనవరి 16న బాధ్యతలు స్వీకరించారు. 2025లో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం కూడా ఇదే. GSLV-F15 రాకెట్ దూసుకెళ్లింది ఇలా.. GSLV రాకెట్ బుధవారం ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ISRO విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. 19 నిమిషాల ప్రయాణం తర్వాత, రాకెట్ తన పేలోడ్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో విజయవంతంగా విడదీసింది...
Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..
State

New IT parks in Hyderabad | రాష్ట్రంలో మ‌రో రెండు ఐటీ పార్కులు..

New IT parks in Hyderabad : హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో రెండు కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైటెక్ సిటీ మాదిరిగా ఆధునిక మౌలిక సౌక‌ర్యాల‌తో వీటిని స్థాపించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT Minister D Sridhar Babu) వెల్ల‌డించారు. దీనికి ప్ర‌త్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్కుల కోసం అనుకూలమైన ప్ర‌దేశాలను ఎంచుకొని అవసరమైన భూముల‌ను కేటాయించేందుకు ప్ర‌క్రియ‌ను ప‌క‌డ్బందీగా చేప‌డుతున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ముందుకొచ్చిన పెట్టుబ‌డిదారులు కొత్త‌గా ఏర్ప‌డ‌నున్న ఐటీ పార్కుల కోసం న‌గర పరిసర ప్రాంతాల్లో అనుకూలమైన భూముల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు తెలిపారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులకు అనువైన ప్ర‌దేశాల‌నే ఎంచుకుంటామ‌ని చెప్పారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన డ్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీ (‘Dew’ Software Comp...
Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”
Special Stories

Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”

ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఘనుడు.. Illegal Registrations in Khammam | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు టూ మినట్స్ న్యూడుల్స్ చేసినంత ఈజీ.. ఈ విషయంలో ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సప"రేటు"గా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వందలాది రిజిస్ట్రేషన్ లు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లకే రా"రాజు" అని సదరు సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు బిరుదు కూడా ఇచ్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గతంలో విధులు నిర్వహించిన చోట తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారి అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అధికారి స్టైల్ మగధీర సినిమాలోని డైల...
error: Content is protected !!