Sarkar Live

Privacy Policy

Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!
National

Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!

‘ఆపరేషన్ సిందూర్‌’పై లోక్‌సభలో ఈ రోజు వాడీవేడీగా చ‌ర్చ‌లు (Lok Sabha Debate) సాగాయి. విప‌క్ష నేత‌లు సంధించిన ప్రశ్నలకు ప్ర‌ధాని మోదీ బృందం దీటుగా స‌మాధాన‌మిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రతిపక్షాల వాద‌న‌ల‌ను కొట్టిపారేశారు. పార్ల‌మెంట్ వేదిక‌గా కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోదీ వివరించారు. భారత్, పాకిస్థాన్ కాల్పుల‌ విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరా...
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్
Cinema

రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో అత్యాధునిక హంగుల‌తో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ' ART Cinemas ' థియేటర్‌ను నిర్మించారు. జూలై 31న దీని ప్రారంభోత్సవం జరగనుండగా, తొలి సినిమాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డమ్ మూవీని ప్రదర్శించనున్నారు. 60 అడుగుల భారీ స్క్రీన్‌, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ మల్టీఫ్లెక్స్‌ ఈస్ట్ హైదరాబాద్‌లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అందించనుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ జూలై 31, 2025న ప్రారంభం కానుంది, ఆరు స్క్రీన్లతో ఉన్న ఈ థియేట‌ర్ ఈస్ట్‌ హైదరాబాద్ వాసుల‌కు సినిమాటిక్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ యాక్షన్ డ్రామా, కింగ్‌డమ్ మొద‌టిసినిమాగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ART Cinemas : అత్యాధునిక సాంకేతికత QUBE అభివృద్ధి చేసిన ప్రీమియం లార...
TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..
State

TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్-విజయవాడ మార్గంలో RTC బస్సులకు భారీ డిస్కౌంట్లు! హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభ‌వార్త చెప్పింది. ఈ మార్గంలో ప్ర‌యాణించే బస్సుల్లో టికెట్‌ ధరలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు టికెట్‌ ధరల్లో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ పోస్టులో పేర్కొంది. దీని ప్రకారం.. గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. అలాగే, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర త‌గ్గించిన‌ట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్ తోపాటు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లకు సైతం వర్తించనున్నాయి. . అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని రెండు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ సూచించింద...
Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
error: Content is protected !!