‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 'గోల్డ్ మ్యాన్ (Gold Man) ' సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు తేల్చారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది.
ఐటీ విచారణలో తేలిన షాకింగ్ నిజాలు
సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో తయారు చేసి, వాటిపై పూత పూసినవని అధికారులు గుర్తించారు. 32 రకాల నకిలీ ఆభరణాలను ఆయన వాడుతున్నట్లు తేలింది.
బయటికి కోట్లాది రూపాయల విలువైన బంగారంగా కనిపించే ఆ నగలు, వాస్తవానికి కేవలం రూ. 3 లక్షల విలువ మాత్రమే చేస్తాయని అధికారులు నిర్ధారించారు. కేవలం ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారైనట్లు గుర్తించారు.బయటికి ధనవంతుడిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్ కి సొంత ఇల...




