Government Jobs | రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 14 మంది సబ్ రిజిస్ట్రార్లు
                    Hyderabad | పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్-2 నియామకాలలో ఎంపికై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 14 మంది కొత్తగా సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులయ్యారు. వీరంతా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సచివాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించి ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ . స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయతీ, నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడిరపజేయాలని ఉద్బోధించారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు (Government Jobs) లభిస్తున్నాయని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరక...                
                
             
								



