Sarkar Live

Privacy Policy

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations
Special Stories

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations

​వచ్చిన కాలం నాలుగు రోజులే.. ఉన్నప్పుడే వెనకేసుకోవాలన్నదే లక్ష్యం! నిబంధనలు గాలికి.. చెరువు శిఖం భూములకు కూడా రిజిస్ట్రేషన్లు! కాసులు కురిపిస్తున్న ‘నాన్ లేఅవుట్’ వెంచర్లు.. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు. ​Illegal Registrations in warangal | ఆ కుర్చీకి ఉన్న పవర్ అటువంటిదో.. లేక ఆ అధికారికి ఉన్న 'అండదండలు' అటువంటివో తెలియదు కానీ, అక్కడ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. నిలువునా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సదరు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సాగించిన 'రిజిస్ట్రేషన్ల పర్వం' ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​అంతా 'ఇంచార్జి' మాయ! ​శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల కంటే, ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టిన వారే ఎక్కువ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "వచ్చిన కాలం నాలుగు రోజులు.. ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలి" అన...
ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!
Special Stories

ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!

​వరంగల్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ, నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) తన నిబద్ధతతో, అలుపెరగని పోరాట పటిమతో వరంగల్ పశ్చిమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న తీరు అమోఘం. ​ప్రజా విజయం.. ఒక తపస్సు ఫలితం ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిలోనూ వెన్నుచూపక, దశాబ్ద కాలం పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నాయినికే చెల్లింది. అధికారం లేనప్పుడు కూడా ఆయన సాగించిన ప్రజా పోరాటాలే, నేడు ఆయనను అసెంబ్లీలో వరంగల్ గళంగా నిలబెట్టాయి. ​అభివృద్ధి పథంలో వరంగల్ పశ్చిమ : నాయిని మార్క్ పాలన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (Warangal West )లోని ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపా...
అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement
Special Stories

అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement

ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంపై రైతుల ఆందోళన పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు ​ Grain procurement old method | రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్‌లైన్ ట్రక్ షీట్' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​రైతుల ఆందోళనలకు ప్రధాన కారణాలు.. ​సాంకేతిక సమస్యలు: ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.సర్వర్ సమస్యల వల్ల ట్రక్ షీట్ల జనరేషన్ గంటల తరబడి నిలిచిపోతోంది. ​క్షేత్రస్థాయిలో ఇబ్బందులు: మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉండటంతో రైతులు ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ​కొనుగోళ్లలో జాప్యం: ఒకవైప...
రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’..  కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!
State

రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!

తెలంగాణ రాష్ట్ర సమితి (BRS Party) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభవేళ, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం భవిష్యత్ రాజకీయ పోరాటానికి దిశానిర్దేశం చేసింది. అనంతరం మీడియాలో మాట్లాడిన కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీజేపీ ఎంపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు 'ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం' నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం: "తెలంగాణ అంటే పాకిస్థాన్ కాదు" పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మౌనం ఎందుకు?: "తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే అక్కడ ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అక్కడికక్కడే ని...
తెలంగాణ పోలీసులకు శుభవార్త
Crime

తెలంగాణ పోలీసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పోలీసులు కు డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. హోదాతో నిమిత్తం లేకుండా కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ​సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితులు (శాంతిభద్రతల సమస్యలు) ఉంటే తప్ప, సిబ్బంది కోరినప్పుడు యూనిట్ అధికారులు ఈ సెలవులను నిరాకరించకూడదు. సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన తేదీల ఆధారంగానే ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయబడతాయి. నిబంధనలు.. ​సెలవు కావాల్సిన సిబ్బంది ముందుగానే రాతపూర్వక అభ్యర్థనను తమ పై అధికారులకు అందజేయాలి. ​ రాష్ట్రంలో అత్యంత కీలకమైన భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ సెలవుకు మి...
error: Content is protected !!