పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పదోన్నతి పొందిన అధికారుల మర్యాదపూర్వక భేటీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుండి ఏసీపీ (ACP) లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం సీపీ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.అధికారులను అభినందించిన అనంతరం కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు.పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.నిరంతరం క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ, వారికి సరై...




