TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..
Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల రియంబర్స్మెంట్ చెల్లించిందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
TGSRTC సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
ఆర్టీసీ (TS RTC)లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ నేడు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్...