Rajini Kamal Combo : కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్,లోకనాయకుడు కమల్ హాసన్ (Super Star Rajnikanth, Kamal Hassan) ఇద్దరూ కూడా టాప్ డైరెక్టర్ బాలచందర్ (Balachandhar)శిష్యులే. కెరీర్ మొదట్లో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లోనే నటించారు.ఆ తర్వాత ఇద్దరు చర్చించుకుని కలిసి నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరు ఒకే మూవీలో కనబడి దాదాపు 4 దశాబ్దాల పైనే అయింది.
ఎప్పటి నుండో వీరు కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రజినీ, కమల్ కూడా వారు అనుకున్నది పక్కనబెట్టి కలిసి యాక్ట్ చేయాలని అనుకున్నారట. కానీ ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీగా ఉండడం తో ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజినీ కమల్ హాసన్ కాంబో సెట్ అయినట్టు ఆ మధ్య కోలీవుడ్ లో టాక్ కూడా వినబడింది. అవి రూమర్స్ అని కొందరూ కొట్టిపారేశారు.
ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ మూవీ తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కమల్ ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళారు. అక్కడ రజినీ కాంబో లో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫ్యాన్స్ మా ఇద్దరి కాంబో లో ఓ మూవీ రావాలని కోరుకున్నట్టుగానే మేము కూడా ఎప్పటి నుండో మూవీ ప్లాన్ చేస్తున్నామన్నారు. అది ఇన్నాళ్లకు కుదిరిందన్నారు. స్వయంగా కమల్ హాసన్ ఈ న్యూస్ చెప్పడంతో ఇద్దరి అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు.
లోకేషేనా డైరెక్టర్..?
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే లక్కీ డైరెక్టర్ ఎవరో అని చర్చించుకుంటున్నారు. హిస్టరీ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు(lokesh kanakaraj)డైరెక్ట్ చేస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.చాలా ఏళ్లుగా హిట్టు లేని కమల్ హాసన్ కి విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చి కమల్ కంబ్యాక్ అయ్యేలా చేశాడు. ఇక రీసెంట్ గా రజనీకాంత్ తో కూలీ మూవీ తీసి డీసెంట్ హిట్టు కొట్టాడు. వీరిద్దరితో మంచి హిట్లు కొట్టిన అనుభవం ఉండడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకేష్ చేతిలోకి వెళ్లే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ లో టాక్ వినబడుతోంది.
Rajini Kamal Combo : మరికొద్ది రోజుల్లో నే సెట్స్ పైకి….?
లోకేష్ డైరెక్ట్ చేస్తే ఇండియన్ సినిమా లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోతుందని,కలెక్షన్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సెన్సేషనల్ కాంబో మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, సాంకేతిక నిపుణులు ఎవరనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








