Coolie Trailer | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కూలీ. మూవీ సెట్స్ పై ఉన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తో ముందుకు వస్తున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.రజినీ సినిమాల్లో ఫస్ట్ టైమ్ సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తుంది.
నెగిటివ్ రోల్ లో నాగ్..
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టరే చెప్పుకొచ్చారు. నాగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ (Ameer Khan, upendra, Sathyaraj)లాంటి టాప్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh kanukaraj)మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందులో రజినీ హీరో అవడం, టాప్ యాక్టర్స్ ఇందులో ఉండడంతో బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయమని ఫ్యాన్స్ హంగామా మొదటి నుండి ఉంది.దానికి ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ కూడా ఆడియన్స్ కు ఏదో ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు.
ఈ రోజు మూవీ ట్రైలర్ తో ముందుకు వచ్చి మూవీపై ఇంకా హైప్ పెంచారు. ట్రైలర్ మొదట్లోనే నాగ్ వాయిస్ తో మొదలవుతుంది. లాస్ట్ వరకు కూడా అనిరుధ్ (Anirudh)తన నెక్స్ట్ లెవెల్ బీజీఎంతో అదరగొట్టాడు. అదిరిపోయే షాట్స్ పెట్టి మూవీపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశారు. ఒక్కొక్క షాట్ తో ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు.హింస కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించినా స్టోరీ అలా డిమాండ్ చేసిందేమో అనిపించింది.
Coolie Trailer : రజినీ షాట్స్ లో అదిరిపోయిన బీజీఎం
- ఇక రజినీ కనబడే ఎవ్రీ షాట్స్ లో కూడా అనిరుధ్ బిజీఎం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రజినీ అంటేనే స్టైల్. ఆ స్టైల్ కి తగ్గట్టుగా బీజీఎం పడితే ఆ షాట్ మరో లెవెల్ కి వెళుతుందని మనకు తెలుసు. అలానే అనిరుధ్ బీజీఎం తో దుమ్ము దులిపాడు. నాగ్ ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు. కానీ తనకు సంబంధించిన షాట్స్ ఎక్కువగా చూపించలేదు. నాగ్ విలన్ గా ఎంత వరకు అదరగొడుతాడో అనే అనుమానాన్ని మేకర్స్ ఆడియన్స్ పై ఉంచారనిపించింది. ఇంకా తన షాట్స్ పెట్టుంటే బాగుండేది. ఈనెల 14 న రిలీజ్…
ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ , సౌబిన్ షాహీర్ లాంటి స్టార్స్ ను ట్రైలర్ లో పెట్టి భారీ హైప్ క్రియేట్ చేశారు. సౌబిన్ షాహీర్ డాన్స్ చేసిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక శృతిహాసన్, రజినీకాంత్ మధ్య వచ్చే ఎమోషనల్ షాట్స్ తో ఇది ఒక మంచి ఎమోషనల్ వే లో కూడా వెళుతుందని అనిపించింది.లాస్ట్ లో రజినీ నడిచి వచ్చే షాట్ ట్రైలర్ కి హైలెట్ అని చెప్పొచ్చు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఈనెల 14 న రిలీజ్ అవబోతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.